రుతు సంబంధిత అలర్జీలను తగ్గించాలంటే.. ఎరుపు రంగు ద్రాక్షలు తినండి

మంగళవారం, 12 జులై 2016 (15:52 IST)
ఎరుపు రంగు ద్రాక్ష పండ్లును అధికంగా ఫ్లావనాయిడ్‌లను కలిగివుంటుంది. ఎరుపు ద్రాక్ష పండ్లలో, బీటా కెరోటిన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్, విటమిన్ కె, ఈ, సీ వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఎరుపు ద్రాక్షల్లో వృద్ధాప్య లక్షణాలను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేగాకుండా రుతు సంబంధిత అలర్జీలను తగ్గిస్తుంది. 
 
ద్రాక్ష పండ్లలోని క్వార్సేటిన్ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, శరీరంలో చేరే ఫ్రీ రాడికల్‌లకు యాంటీగా పనిచేసి.. వ్యాధులను దూరం చేస్తుంది. అంతేగాకుండా యాంటీ హిస్టమైన్‌లుగా ద్రాక్షలు పని చేయడం ద్వారా అలర్జీలు తగ్గుతాయి. రెస్వెట్రాల్ ఫ్లావనాయిడ్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి, ఆర్థరైటిస్, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. 
 
పర్పుల్, రెడ్, బ్లూ, గ్రీన్‌ కలర్స్ ద్రాక్షల్లో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ద్రాక్షలలో విటమిన్ సి, సెలీనియం కూడా పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి