సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

దేవీ

సోమవారం, 28 ఏప్రియల్ 2025 (18:24 IST)
Allu Aravind, Sri Vishnu, Ketika Sharma, Ivana, Vennela Kishore
శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నాయికా నాయకులుగా నటించిన చిత్రం సింగిల్‌. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.  మేకర్స్ ఈరోజు ట్రైలర్‌ను లాంచ్ చేశారు.  
 
ట్రైలర్ ఒక హ్యూమరస్ నోట్ తో ప్రారంభమవుతుంది. శ్రీ విష్ణు ఒక అమ్మాయి మనసుని గెలుచుకోవడానికి మూడు గోల్డెన్ టిప్స్ ఇస్తాడు. అమ్మాయిలు " గుడ్ బాయ్స్"ని ఇష్టపడతారని చెబుతాడు. తరువాత "బ్యాడ్ బాయ్ యాటిట్యూడ్" వస్తుంది. చివరగా, టిప్ నంబర్ త్రీ "మాస్ వాయిస్" కస్సింగ్ వర్డ్స్, ఆల్ఫా మేల్ డామినెన్స్. శ్రీవిష్ణు పూర్వ (కేతిక శర్మ) అనే అమ్మాయిని ఇష్టపడినప్పుడు, మరొక అమ్మాయి హరిణి (ఇవానా) అతనిపై ప్రేమ చూపిస్తుంది, ఇది ట్రై యాంగిల్ లవ్ స్టొరీకి స్టేజ్‌ని సెట్ చేస్తోంది.
 
ట్రైలర్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్‌ని ప్రామిస్ చేస్తోంది. కామెడీ, రొమాన్స్, లైటర్ డ్రామా బ్లెండ్‌ని అందిస్తోంది. ఈ మూవీ యూత్‌కు, ముఖ్యంగా సింగిల్స్‌, కుటుంబ ప్రేక్షకులకు సమానంగా నచ్చేలా చూసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ రాజు. శ్రీ విష్ణు తనను కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఎందుకు పరిగణిస్తారో మరోసారి నిరూపించాడు. అతని కామిక్ టైమింగ్ అదిరిపోయింది. కేతిక శర్మ, ఇవానా పాత్రలు ఆకట్టుకున్నాయి. వెన్నెల కిషోర్ తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో హ్యుమర్‌ని ఎలివేట్ చేశాడు.
 
ఆర్.వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ చిత్రానికి రిచ్ విజువల్స్‌ని అందించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం హ్యుమర్ టోన్ పెంచుతుంది. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ ఎడిటర్ కాగా, చంద్రిక గొర్రెపాటి ఆర్ట్ డైరెక్టర్‌. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ, సీరియస్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తీసిన తండేల్ చాలా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమాకి విజయాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు. ఆ సినిమా జరుగుతున్నప్పుడే సరదాగా నవ్వుకునే ఒక కథ చేయాలని విద్యాకి చెప్పాను. అప్పుడు భాను రియాజ్ 'సింగిల్' కథని తీసుకొచ్చారు. డైరెక్టర్ కార్తీక్ ఈ కథ చెప్తున్నా రెండు గంటల పాటు నేను కిందపడి పగలబడి నవ్వుతూనే ఉన్నాను. అంతా అద్భుతంగా చెప్పారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కనిపించినప్పుడు నవ్వులు మామూలుగా ఉండవు. ఈ సినిమా సమ్మర్ కే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఇది సమ్మర్ కి యాప్ట్ అయ్యే సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా.  మే9న అందరూ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. విశాల్  చంద్రశేఖర్ గారు చాలా తక్కువ సినిమాలు మ్యూజిక్ చేస్తారు. ఆయన ఈ సినిమాని ఒప్పుకొని చేయడం చాలా ఆనందంగా ఉంది. భాను నందు ఈ సినిమాకి చాలా అద్భుతమైన డైలాగులు రాశారు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ లో ఈ సినిమా ఆడియన్స్ అందరినీ చాలా కూల్ గా ఉంచుతుంది'అన్నారు.  
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, ఇంటిళ్లపాది కడుపుబ్బ నవ్వించాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేయడం జరిగింది. వెన్నెల కిషోర్ గారు కేతిక ఇవాన .. ఇలా మంచి టీమ్ అంతా జాయిన్ అయిన తర్వాత ఇరగబడి నవ్వించాలనే ఉద్దేశం కాస్త కసిగా నవ్వించాలనంతగా తోడయ్యారు. మే 9 నెల సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా స్క్రీన్ ప్లే, స్టొరీ చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది.  తప్పకుండా థియేటర్స్ లో చూడండి. హ్యాపీగా నవ్వుకుంటారు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు'అన్నారు  
 
ప్రొడ్యూసర్ విద్య మాట్లాడుతూ, ఇది చాలా ఫన్ ప్రాజెక్ట్. విష్ణుగారు, కిషోర్ కేతిక ఇవాన చాలా సపోర్ట్ చేశారు. ట్రైలర్లు కంటే థియేటర్స్ లో ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అన్నారు. హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ, విష్ణు గారు వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్ పడి పడి నవ్వుతారు. విశాల్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఈవాన కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. మే 9న థియేటర్స్ లో కలుద్దాం'అన్నారు  
 
హీరోయిన్ ఇవాన మాట్లాడుతూ.. మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలు విద్య గారు భాను గారు రియాజ్ గారు అరవింద్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా ఫన్ రైడ్. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను.  డైరెక్టర్ కార్తీక్ గారికి థాంక్యూ శ్రీ విష్ణు గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా థియేటర్లో చూసి సినిమా ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు  
 
యాక్టర్ వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కార్తీక్ రాజు అన్ని సినిమాల్లో నన్ను పెట్టుకుంటారు. ఆయన నెక్స్ట్ సినిమాలో కూడా రోల్  ఉందని చెప్పారు. విద్యా గారు భాను గారు రియాజ్ గారు చాలా అద్భుతంగా చూసుకున్నారు. శ్రీ విష్ణు గారికి థాంక్యూ అల్లు అరవింద్ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ నగరానికి ఏమైంది ఆరెంజ్ లాంటి సినిమాలు కి కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది అలాంటి కల్టి ఫాలోయింగ్ హీరోయిన్  కేతికే శర్మ గారు. ఆమె  ఫ్యాన్స్‌లో నేను ఒకడిని( నవ్వుతూ  ఇవానతో  వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్యు'అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు