ఇంకా ఈ పండులోని ఉండే గుజ్జుకు త్వరగా జీర్ణం చేసే గుణం ఉంది. ఎక్కువగా పండ్ల రసాలలో వాడతారు. ఈ పండు కంటికి చాలా మంచిది. విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల, వృద్ధాప్యంలో కంటి చూపు పోకుండా కాపాడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోవడానికి పనికొస్తుంది. నిద్రలేమి, ఆందోళనతో బాధపడుతున్నవారు సపోటాను తినాలి.
ఇంకా ఇందులోని కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు తోడ్పడుతుంది. పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు మెండుగా ఉండటం వల్ల పాలు ఇచ్చే తల్లులకు, గర్భిణులకు ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.