టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల పుణ్యంతో నేటి యువతరం క్రీడలు ఆడుకునేందుకు, వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపట్లేదు. స్మార్ట్ ఫోన్ లోకంలో.. ఆ మాయలో తిరగాడుతోంది. అయితే స్మార్ట్ ఫోన్ వ్యసనం భవిష్యత్ తరాలకు పెనుముప్పు మారనుందని ట్వెంజ్ అనే అమెరికా పరిశోధకురాలు తెలిపారు.
స్మార్ట్ ఫోన్ల కారణంగా సెక్యువల్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయని తద్వారా ఒత్తిడి పెరిగిపోతుందని క్వెంజ్ చెప్పారు. దీంతో సంతోషంగా వుండాల్సిన యువత ఏదో కోల్పోయినట్టుగా వుందనే విషయం పరిశోధనలో క్వెంజ్ చెప్పుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ల కారణంగా డేటింగూ లేదు... ఒళ్లొంచి శ్రమపడట్లేదని తద్వారా మానసిక ఆందోళలనకు గురవుతున్నారని క్వెంజ్ తెలిపారు.