భోజనానికి ముందు సూప్ తాగండి.. చిరుతిళ్లకు బదులు పండ్లు తీసుకోండి..

మంగళవారం, 11 అక్టోబరు 2016 (18:14 IST)
భోజనానికి ముందు సూప్‌, సలాడ్‌ వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే భోజనం తక్కువగా తీసుకోగలుగుతారు. అంతేకాదు చిరుతిళ్లకు బదులు పండ్లు ఎంచుకోవడం వల్ల వాటిల్లోని పీచు అరుగుదలకు తోడ్పడుతుంది. తద్వారా బరువు తగ్గుతుంది.  
 
కొన్ని పదార్థాలను అదే పనిగా అతిగా తీసుకోకండి. అప్పుడే అదనపు కెలొరీలు శరీరంలోకి చేరవు. బరువూ పెరగరు. ఇంకా తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి.
 
ప్యాక్‌ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవండి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది. రోజూ అరగంట నడవండి. ఒకే చోట కూర్చోకండి. అలా కూర్చోవాల్సి వస్తే గంటకు అటూ ఇటూ ఐదు నిమిషాలు తిరగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి