ఫాస్ట్ ఫుడ్, పిండివంటలు వద్దు.. కూరగాయలు, పండ్లే ముద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయని పరిశోధనలో తేలింది. కూరగాయల్లో, పండ్లలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా.. ఆరోగ్యంగా ఉంటారని కివీస్ యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది.
కూరగాయలు తీసుకున్న వారు మానసికంగా చాలా ప్రశాంతంగా.. దృఢంగా ఉన్నామని చెప్పారట. గుర్తు చేసినప్పుడు మాత్రమే తిన్నవారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదట. దీనిని బట్టి కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చునని పరిశోధనలో వెల్లడైంది.