నిమ్మరసంతో మెరిసే పళ్ళు మీ సొంతం?

శుక్రవారం, 25 మార్చి 2016 (10:09 IST)
వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే కొన్నిరకాల కూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు న్యూట్రీషన్లు. తాజా నిమ్మరసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
 
దేహంలోని మలినాలను తొలిగించడంలో కీరదోస పాత్ర కీలకం. విటమిన్‌ 'సి' తోపాటు ఐరన్ సమృద్ధిగా లభించే పుదీనా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
 
నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది. కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. 'సి' విటమిన్‌ సమృద్ధిగా లభించి చర్మం కాంతులీనుతుంది.
 
ఇవే కాకుండా బత్తాయి, క్యారెట్‌, అల్లం, తేనెతో తయారుచేసే రసాలు చర్మానికి మేలు చేస్తాయి. బత్తాయి రోగనిరోధక శక్తిని పెంచితే, అల్లం జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. దీంతో చర్మం నిగనిగలాడుతుంది. 

వెబ్దునియా పై చదవండి