వేసవివిలో శరీరం చల్లగా ఉండాలంటే అదొక్కటే మార్గం.. ఏంటది..?

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (22:14 IST)
బంగారం రంగులో చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్యశాస్త్రాల్లో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడుతారు. సాధారణంగా చెరకు రసం నుంచి బెల్లాన్ని తయారుచేస్తారు. బెల్లంలో అనేక రకాలైన ఔషధ గుణాలున్నాయి. ప్రతిరోజు కాస్త బెల్లం ముక్క తినడం వల్ల రక్తశుద్థి జరిగి వ్యాధులు దరిచేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
బెల్లం లివర్ పనితీరును మెరుగురుస్తుందట. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుందట. బెల్లంలోని యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజ లవణాలురోగ నిరోధక శక్తిని పెంచి ప్రీలాడికల్ ఇన్ఫెక్షన్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. అధిక బరువుతో బాధపడేవారు రోజూ వందగ్రాముల బెల్లం తింటే సన్నగా అవ్వుతారట. అంతే కాదు ఎండవేడిమిని తట్టుకోవాలంటే బెల్లం పాకం తాగితే శరీరం చల్లబడుతుందట. అంతే కాకుండా ఆడవారిలో నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు