రైస్ కుక్కర్లు వాడుతున్నారా? అస్సలు వాడకండి బాబోయ్..

శనివారం, 24 ఆగస్టు 2019 (17:40 IST)
మట్టిపాత్రలు, స్టీల్ పాత్రలు వాడితే మంచిది. కానీ అల్యూమినియం పాత్రను పక్కనబెట్టేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాకుండా కుక్కర్లలో అన్నం వార్చడం.. అదీ రైస్ కుక్కర్లను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని వారు హెచ్చరిస్తున్నారు. రైస్‌కుక్కర్లలో వండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అతి చిన్న వయస్సుల్లోనే కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి అంటూ డీలా పడిపోతున్నారు. 
 
రాగిసంకటి, రాగిజావ, జొన్న రొట్టెలు, కొర్రలతో టిఫిన్లు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం వండేంత సమయం లేదనుకుంటే ఫ్రెజర్ కుక్కర్ వాడండి. కానీ కరెంటు కుక్కర్‌లో వండకపోవడం మంచిది. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ కుక్కర్లను దూరంగా వుంచడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కరెంట్ ద్వారా ఉడికిన ఆహారాన్ని తీసుకోకపోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేసినట్లే. 
 
ఇందులోని ఆహారం విషతుల్యం అయ్యే ఆస్కారం వుందని.. ఇందుకు రైస్ కుక్కర్లలోని టాక్సిన్ మెటల్ కారణమని పరిశోధనలో తేలింది. ఇందులో అన్నం ఉడికించడం ద్వారా అందులోని పోషకాలు కనుమరుగవుతున్నాయని.. అవి కూడా నాన్ స్టిక్ కోటింగ్ గల రైస్ కుక్కర్లను అస్సలు వాడకూడదట. 
 
ఎందుకంటే నాన్ స్టిక్ వస్తువుల్లో ప్రమాదకరమైన కెమికల్స్ వండేటప్పుడు విడుదల అవుతాయని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది. అందుచేత మట్టిపాత్రలు లేకుంటే స్టీల్ పాత్రల్లో అన్నం వుడికించుకుని తీసుకోవడం ఎంతో మేలు. సాధ్యమైనంతవరకు రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు