Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

దేవీ

మంగళవారం, 26 ఆగస్టు 2025 (19:08 IST)
Srileela, Swarnalatha
కథానాయిక శ్రీలీల గురించి తెలియందికాదు. ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుంది. నాయిక అవుతానని అనుకోలేదట. తనకు బిడ్డ పుడితే డాన్సర్ చేయాలని ఆమె తల్లి స్వర్ణలత కోరుకుందట. ఈ విషయాన్ని శ్రీలీల ఇటీవలే టీవీ షోలో తెలియజేసింది. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టీవీ  షోలో శ్రీలీల పాల్గొంది. ఆమెతోపాటు ఆమె తల్లి స్వర్ణలత కూడా వచ్చింది. 
 
షోలో జగపతి బాబు చిన్నతనంలో ఎన్టీఆర్ కూచిపూడి డ్యాన్స్ వేసిన ఫొటో వారికి చూపించాడు. వెంటనే శ్రీలీల తల్లి మాట్లాడుతూ.. తారక్ ని అలా చూసినప్పుడే నాకు అమ్మాయి పుడితే క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలని అనుకున్నా. 1997లో మేము అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఉండేవాళ్ళం. అక్కడ జరిగే తానా సభలకు హాజరయ్యేవాళ్ళం. ఆ ఈవెంట్లో తారక్ డ్యాన్స్ చేసాడు.

అప్పుడు ఎన్టీఆర్ తో కూడా మాట్లాడాను. అమ్మాయి పుడితే మాత్రం డెఫినెట్ గా ఇలా డ్యాన్స్ చేయిస్తాను అని తారక్ కి చెప్పాను. అమ్మాయి పుడితే ఇలా ట్రెడిషినల్ డ్యాన్స్ చేయించాలని అప్పట్నుంచి నా కోరిక. అందుకే శ్రీలీలకు అన్ని నేర్పించానని స్వర్ణ లత తెలిపారు. తను ముందు డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మెడిసిన్ చదివింది. ఈలోగా సినిమాల్లో చాన్స్ వచ్చాయని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు