కొలెస్ట్రాల్‌ పనిపట్టే టమాటా!

శనివారం, 23 ఏప్రియల్ 2016 (20:15 IST)
అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు తరచూ టమాటాలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే టమాటాల్లో ఉండే ఎర్రని ‘లైకోపీన్’ అనే వర్ణద్రవ్యం కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందని తేలింది. ధమనులను దృఢంగా ఉంచడంతోపాటు గుండె ఆరోగ్యానికీ లైకోపీన్ మేలు చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఆడిలైడ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 
 
55 ఏళ్ల అధ్యయన వివరాల ఆధారంగా తాము నిర్వహించిన 14 పరిశోధనల ద్వారా ఈ విషయం తేలిందని వర్సిటీ పరిశోధకులు కరీన్ రీడ్, పీటర్ ఫాక్లర్‌లు తెలిపారు. మందు బిళ్లలు మింగేకన్నా రోజూ అరలీటరు టమాటా రసం (దాని నుంచి 25 మిల్లీగ్రాముల లైకోపీన్ లభిస్తుంది) లేదా 50 గ్రాముల టమాటా పేస్టు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను సమర్థంగా తగ్గించొచ్చని వారు వివరించారు.

వెబ్దునియా పై చదవండి