డాల్డాను వాడితే మధుమేహం.. ఒబిసిటీ తప్పదట..

బుధవారం, 5 మే 2021 (19:51 IST)
Dalda
వనస్పతిని అధికంగా వాడితే అనారోగ్య సమస్యలు తప్పవు. వనస్పతిలో చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. మంచి కొవ్వులతో పోల్చినప్పుడు చెడు కొవ్వులు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. వనస్పతిలో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 
 
ఎల్‌డీఎల్ నిష్పత్తిని తగ్గించకుండా పెంచుతాయి. వీటి స్థాయి హెచ్‌డీఎల్ లేదా మంచి కొవ్వుల స్థాయికి చేరడంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా వుండా డాల్డాను తీసుకోవడం వల్ల పొట్టలో కొవ్వు నిల్వలు పెరిగి బరువు పెరుగుతారు. 
 
డాల్డాను ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని కణాల విధులకు అంతరాయం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇన్సులిన్‌ను సెన్సిటివిటీని తగ్గిస్తాయి. ఫలితంగా మధుమేహం ఏర్పడుతుంది. దీర్ఘకాలం పాటు పొట్టలో పేరుకుపోయిన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లను కరిగించకపోవడం శారీరక శ్రమ లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వల్ల కంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ల వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు