ఉదయం పూట సూర్యుని కిరణాలు, సాయంత్రం సూర్యాస్తమయ కిరణాలు శరీరంపై పడటం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చునని ఇప్పటికే పలు పరిశోధనలు కూడా తేల్చాయి. సూర్య కిరణాల ద్వారా మనస్సు, శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. రోజంతా చురుకుగా వుండేలా చేస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై పడటం ద్వారా కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా బరువు తగ్గుతారు. నాజూగ్గా వుంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్ కాకుండా ఫైబర్ కలిగి వుండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు. అలాగే ఆఫీసుల్లో లిఫ్టులు వాడకపోవడం మంచిది. సాయంత్రం పూట సైక్లింగ్ చేయడం, జాగింగ్ చేయడం వంటివి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా శరీర బరువును పెరగనీయకుండా చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.