పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే.. నెలసరి సమస్యలు మటాష్

సోమవారం, 20 మార్చి 2017 (18:06 IST)
పుదీనాను రోజూవారీగా ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలోని రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఉదరంలోని సూక్ష్మక్రిములను పుదీనా నశింపజేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు.. ఎండిన పుదీనాను గుప్పెడు తీసుకుని.. ఒకటిన్నర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించి.. ఆ నీటిని  సేవించాలి. ఇలా చేస్తే జ్వరం తగ్గిపోతుంది. 
 
అలాగే మాంసాహారం, కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే.. పుదీనాను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి. జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది. నెలసరి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మహిళలు పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే మంచిది. పుదీనా చట్నీ తీసుకుంటే.. ఉదర సమస్యలు దరిచేరవు. గర్భవతులు వేవిళ్లు తగ్గించుకోవాలంటే.. పుదీనాను డైట్‌లో చేర్చుకోవాలి. 
 
పచ్చ కామెర్లు, వాతం, దగ్గు, రక్తహీనత, నరాల బలహీనతకు పుదీనా దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మం పొడిబారినట్లు కనిపిస్తే.. పుదీనా రసాన్ని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పుదీనాను నీడలో ఎండబెట్టి పాలలో చేర్చి మరిగించి.. టీకి బదులుగా సేవిస్తే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని వారు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి