నిప్పు కణాల్లా కళ్లు ఎర్రగా ఉంటే...
కొందరి కళ్లను చూసినప్పుడు నిప్పు కణాల్లా ఎర్రగా ఉంటాయి. వైద్యుడు పరీక్షించి చూస్తే రెటీనా పైన చిన్నచిన్న రక్త కణాలు కనబడుతాయి. దీనికి కారణం అధిక రక్తపోటు. అధిక రక్తపోటు కారణంగా కంటిలోని నరాలు ఇలా ఎర్రగా మారుతాయి. కొన్నిసార్లు అవి పగిలిపోవడం కూడా జరుగుతుంది. దాంతో కళ్లు ఎర్రగా కనబడుతాయి. ఐతే ఈ విషయం అధిక రక్తపోటు కలిగిన నాలుగో వంతు మందికి తెలియదు. ఇలాంటి వారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలుంటాయి. అందువల్ల కళ్లు ఎర్రబడితే.. ఆ ఏం జరుగుతుందిలే అని వదిలేయకూడదు.
కంటి వెనుక భాగంలో పసుపుగా ఉంటే... మధుమేహం
కొందరికి కనులలో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది. లేదంటే రెటీనా చిన్నచిన్న నీటిబొట్లు ఉన్నట్లు కనబడుతుంది. ఇలాంటివారిలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
కళ్లు పసుపు పచ్చగా ఉంటే...
కొందరి కళ్లు పసుపు పచ్చగా అగుపిస్తాయి. అలాంటివారిలో కాలేయ సమస్య ఉందని గుర్తించాలి. కళ్లు ఇలా మారిపోవడానికి కారణం కాలేయం పనితీరులో తేడా ఉండటమే. అందువల్ల వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే తగు సలహాలు తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.