ఐస్ టీ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సోమవారం, 12 జూన్ 2023 (16:44 IST)
ఐస్ టీ. అసలే ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చల్లగా ఐస్ టీ తాగితే కాస్తంత రిలాక్స్ కలుగుతుంది. ఈ ఐస్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము. ఐస్ టీ తాగుతుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఐస్ టీలో వుండే క్యాటెచిన్ అనే ఫ్లేవనాయిడ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వులను త్వరగా విచ్ఛిన్నం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 
యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దంతాలను రక్షించే, నోటి ఆరోగ్యాన్ని కాపాడే ఫ్లోరైడ్ అధిక స్థాయిని కలిగి ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గించి యవ్వనంగా వుంచుతుంది. శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు