తృణధాన్యాల గింజలు అయిన ఓట్స్‌లో ప్రోటీన్, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫోలేట్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉన్నాయి. ఓట్స్ తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్‌లో ఉండే లిగ్నన్ గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. ఓట్స్‌లో ప్రోటీన్, ఫైబర్ ఉండటం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు నియంత్రణలో వుంటుంది.
క్రమం తప్పకుండా ఓట్స్‌ను ఆహారంలో తీసుకోవటం వలన ఆందోళన, ఒత్తిడి నుండి దూరంగా ఉండవచ్చు. ఓట్స్ తినటం వలన చర్మం మృదువుగా, తేమగా ఉండటానికి సహాయపడుతుంది.
ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్ రాకుండా చూస్తుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.