ప్రోటీన్ ఫుడ్ అధికంగా తింటే ఏమవుతుంది

సిహెచ్

గురువారం, 14 మార్చి 2024 (23:57 IST)
ఆరోగ్యంగా వుండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. మోతాదు ఏది అధిగమించినా సమస్య ప్రారంభమవుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ కంటే ఎక్కువ తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ప్రోటీన్ అధికంగా వున్న ఆహారం తింటే జీర్ణసమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ తదితర సమస్యలు రావచ్చు.
మోతాదుకి మంచి ప్రోటీన్ వుంటే కిడ్నీల పనితీరు కూడా మందగించి కిడ్నీ సమస్యలు రావచ్చు.
అధిక మోతాదులో ప్రోటీన్ ఫుడ్ తింటే డీహైడ్రేషన్ కూడా తలెత్తవచ్చు.
ప్రోటీన్ ఫుడ్ అధికంగా తింటే స్థూలకాయులుగా మారుతారు.
కాలేయం పనితీరు మందగించి లివర్ సమస్య కూడా రావచ్చు.
ప్రోటీన్ ఫుడ్‌కి బానసలుగా మారితే అది కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి కూడా దారితీయవచ్చు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు