రాత్రివేళ పెందలాడే భోజనం చేస్తే ఏమవుతుంది?

మంగళవారం, 11 జులై 2023 (15:53 IST)
రాత్రిళ్లు చేసే భోజనాన్ని పెందలాడే... అంటే 7 గంటల లోపు చేసేయాలని పెద్దలు సలహా ఇస్తుంటారు. రాత్రివేళ అలా పెందలాడే తినడం వల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. బాగా పొద్దుపోయాక భోజనం తీసుకుంటే అది సరిగా జీర్ణం కాదు. పెందలాడే ఆహారం తీసుకోవడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి, ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
 
భోజనం పెందలాడే తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది, ఇది బరువును సక్రమంగా ఉంచుతుంది. ఇలా పెందలాడే భోజనం చేయడం వల్ల రాత్రి నుండి ఉదయం వరకు ఏమీ తినరు, ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా ఉంటుంది. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది, ఎసిడిటీ సమస్యలు రావు.
 
రాత్రివేళ త్వరగా ఆహారం తీసుకోవడం వల్ల ఉదయం లేవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, త్వరగా లేవగలుగుతారు. రాత్రివేళ 7 గంటల లోపు ఆహారం తీసుకోవడం ద్వారా ఉదయాన్నే మీ పొట్ట సులభంగా క్లియర్ అవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు