రొయ్యలు తింటే ఏంటి లాభం? (video)

ఆదివారం, 1 మే 2022 (14:52 IST)
రొయ్యలను ప్రపంచంలోని అత్యంత రుచికరమైన, ప్రయోజనకరమైన మత్స్య సంపదలో ఒకటిగా పిలవవచ్చు. రొయ్యలలో చాలా స్థూల, సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. అయితే, ఏవైనా అరుదైన అలెర్జీలు లేదా వైద్య పరిస్థితులు... గర్భధారణ జరిగి ఉంటే, తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

 
అంతే కాకుండా, రొయ్యలను రెగ్యులర్ భోజనంలో భాగం చేసుకోవడం వల్ల గుండె రక్తనాళాలు, జీవక్రియ, క్యాన్సర్ వంటి ప్రధాన దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకోవచ్చు. బరువు తగ్గడానికి రొయ్యలు ఉపయోగపడుతాయి. రొయ్యల్లో తక్కువ కేలరీలుంటాయి. అందువల్ల బరువు అదుపులో వుంటుంది. అంతేకాకుండా కండరాల బరువును పొందడంలో సహాయపడుతుంది కాబట్టి యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించడంలో సహాయపడుతుంది.

 
చర్మం- వెంట్రుకలను టాక్సిన్ లేకుండా ఉంచుతుంది. ఎందుకంటే రొయ్యలు విటమిన్ ఇ కలిగి వుంటాయి. రొయ్యల్లో బి 12, ఫోలేట్‌తో సహా బి గ్రూప్ విటమిన్‌లకు ఉపయోగకరమైన మూలం. కనుక వారానికి ఒకసారైనా రొయ్యలు తీసుకుంటూ వుండాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు