World AIDS Day 2022 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంటే ఏమిటి?

గురువారం, 1 డిశెంబరు 2022 (10:54 IST)
ప్రతి సంవత్సరం, డిసెంబర్ 1 న, ప్రపంచ దేశాలు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజును జరుపుకుంటారు. 
 
ఇంకా హెచ్‌ఐవితో జీవిస్తున్న వ్యక్తులకు మద్దతునిచ్చేందుకు, ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో మరణించిన వారిని స్మరించుకోవడానికి ఈ రోజును జరుపుకుంటారు. ప్రతి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఒక నిర్దిష్ట థీమ్‌పై దృష్టి పెడుతుంది.
 
ఈ సంవత్సరం గ్లోబల్ ఐకమత్యం, బాధ్యత (Global solidarity, shared responsibility) అనేది థీమ్‌గా మారింది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసిన సవాళ్ల జాబితాలో ఈ సంవత్సరం థీమ్ చేరింది.
 
 
ఎయిడ్స్‌ను అంతం చేయడంలో పురోగతిని అడ్డుకుంటున్న అసమానతలను పరిష్కరించాలని UNAIDS మనలో ప్రతి ఒక్కరినీ కోరుతోంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసిన సవాళ్ల జాబితాలో ఈ సంవత్సరం థీమ్ చేరింది.
 
1988 నుంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, ప్రభుత్వాలు, పౌర సమాజం కలిసి HIVకి సంబంధించిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నాయి. 
 
 
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచే కార్యక్రమాలు జరుగుతాయి. చాలా మంది వ్యక్తులు ఎరుపు రిబ్బన్‌ను ధరిస్తారు, ఇది హెచ్‌ఐవితో జీవిస్తున్న వ్యక్తుల పట్ల అవగాహన, మద్దతు తెలపాల్సిందిగా ప్రచారం చేస్తారు. 
 
హెచ్‌ఐవితో జీవిస్తున్న వ్యక్తులు తమ జీవితాల్లో ముఖ్యమైన సమస్యలపై తమ వాణిని వినిపిస్తారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పటిలాగే నేడు అంటే డిసెంబర్ 1న జరుపుకోబడుతోంది.  హెచ్‌ఐవి అంతరించిపోలేదని ప్రజలకు.. ప్రభుత్వాలకు గుర్తుచేస్తుంది.
 
ప్రజల జీవితాలపై HIV ప్రభావం గురించి అవగాహన పెంచడానికి, ఈ వ్యాధిని అంతం చేయడానికి. HIVతో జీవిస్తున్న ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఇంకా అధిక నిధులు అవసరం. అందుచేత హెచ్ఐవీని తరిమికొట్టేందుకు.. ఆ రోగులకు మద్దతుతో పాటు సాయం అందించేందుకు కృషిచేయాలనే నినాదంతో ముందుకు వెళ్దాం.. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు