ఈ ఆధునిక యుగంలో పెరుగుతున్న కాలుష్యానికి అనుగుణంగా జుట్టు అనారోగ్యానికి గురి అవుతుంది. ఇందులో ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడటం ఎక్కువమందిలో చూస్తున్నాము. జుట్టు మూలలలో లేదా ఫాలికిల్‌లో సహజసిద్ధ వర్ణ ద్రవ్యం అయినట్టి మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు తెల్లగా అవుతుంది. ఇలా వీటి ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు మొదళ్లు నెమ్మదిగా బలహీనమవుతాయి. ఫలితంగా వెంట్రుకల రంగు నెమ్మదిగా కోల్పోయి తెలుపు రంగులోకి మారుతుంది. జుట్టు తెల్లగా అవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
2. మంచి పోషకాలతో కూడిన ఆహారం మీ ఆరోగ్యాన్ని మాత్రమె కాకుండా మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. విటమిన్ 'B 12', టీ అధికంగా తీసుకోవటం, కాఫీ, కారపు ఆహారాలు మరియు వేయించిన ఆహారాలు తీసుకోవటం వలన జుట్టు త్వరగా నెరుస్తుంది.
4. జుట్టు నెరవటానికి చాలా రకాల పోషకాల లోపం అని చెప్పవచ్చు, అంతేకాకుండా, ఈ పోషకాల లోపం వల్లనే జుట్టు రాలటం, బలహీనంగా అవటం లేదా మెరుపును కోల్పోతాయి. యుక్త వయసులో జుట్టు నెరవటానికి ఈ పోషకాల లోపమే ఒక కారణం. సరియైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడకుండా చూసుకోవచ్చు.