ఇటీవలి కాలంలో వయసుతో పనిలేకుండా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి తొందరగానే వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి. దీనివల్ల నలుగురితో తిరిగాలన్నా.. పెళ్లిళ్ళకు పబ్బాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు వంటింట్లో లభ్యమయ్యే వస్తువులతోనే చెక్ పెట్టొచ్చు.
* నువ్వులను మెత్తగా చేసి అందులో బాదం ఆయిల్ వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును కొన్ని వారాల పాటు మాడుకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లబడుతుంది.
* ఉల్లిపాయ పేస్టు తెల్ల వెంట్రుకలపై బాగా పని చేస్తుంది. పేస్టును దట్టంగా మాడుకు పట్టించి అది పూర్తిగా ఆరిపోయేంతవరకు ఉంచాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్టు వాసన పోయేలా షాంపుతో తలను బాగా రుద్దాలి.
* క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యారెడ్ డ్రింక్ రుచిగా ఉంటుంది. తెల్లవెంట్రుకలున్న వారు నిత్యం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగినట్టయితే మంచి ఫలితం ఉంటుంది.
* కొబ్బరి నూనెలో కాస్తంత నిమ్మరసం పిండుకుని దాన్ని మాడుకు రాసుకుంటే మంచిది. ఇది తెల్ల వెంట్రుకలపై మంచి ప్రభావం చూపుతుంది. శిరోజాలను అందంగా, కాంతివంతంగా కూడా చేస్తుంది.