ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

సిహెచ్

ఆదివారం, 20 అక్టోబరు 2024 (00:25 IST)
ఖర్జూరంలో ఎన్నో పోషకాలున్నాయి. ఇది చర్మాన్ని బలోపేతం చేసి కాంతివంతంగా మారుస్తుంది. కేశాలను దృఢంగా మార్చి నిగనిగలాడేట్లు చేస్తుంది. ఇది మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహించి రక్తహీనతను నివారిస్తుంది. ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాము.
 
ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీన్ని పవర్ బూస్టర్ అంటారు.
ఖర్జూరం పాలకు చర్మాన్ని కాంతివంతం చేసే శక్తి వుంది.
రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది.
రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ఇది దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది.
కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
గమనిక: వైద్యుడిని సంప్రదించిన తర్వాత చిట్కాలను ప్రయత్నించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు