ఎర్ర చందనం. ఇది ఫర్నిచర్ తయారీకి బాగా ఉపయోగించబడుతుంది. అలాగే సాంప్రదాయ ఔషధాలలో, మధుమేహం, చర్మ వ్యాధులు, పుండ్లు, కంటి వ్యాధులు, పాము-తేలు కుట్టడాలకి విరుగుడుగా ఉపయోగిస్తారు. ఎర్ర చందనం ఔషధ విలువలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర చందనం ప్రత్యేకించి చర్మ రుగ్మతలకు చికిత్సగా ఉపయోగపడుతుంది. అధిక దాహం నుండి ఉపశమనం కలిగించే శక్తి దీనికి వుంది.