నిద్రతగ్గితే బరువుతోపాటు ఇతర సమస్యలు కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. మనిషికి దాదాపు 7 గంటలకు పైగా నిద్ర అవసరం అని వారంటున్నారు. అవసరం అయినదానికంటే తక్కువగా నిద్రపోయే మహిళలు, పురుషులు బరువు పెరిగే అవకాశం ఎక్కువని రుజువయ్యింది. రోజుకు 5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రపోయేవారు 7 గంటలకు పైగా నిద్రపోయేవారి కంటే అధిక బరువు ఉన్నట్లు గుర్తించారు.
ఆరుగంటలు నిద్రపోయే వారు 7 గంటలు అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికంటే 1.5 పౌండ్లు బరువు అధికంగా ఉన్నట్లు పరిశోధనలు తేల్చాయి. నిద్రలేమికి, బరువు పెరగడానికి గల సంబంధం శారీరక కార్యకలా పాలు, ఆహార అలవాట్లతో ముడిపడి ఉంటుంది. నిద్ర ఎక్కువగా పోయేవారి కంటే తక్కువ నిద్ర పోయేవారి లో క్యాలరీల స్వీకరణ తక్కువ స్థాయిలో ఉంటుంది.
నిద్ర తక్కువైతే శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెళకువరావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన కొన్ని ముఖ్య కారణాలు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉంది.
హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 - 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది.