ఊబకాయానికి కారణాలివే..?

సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (14:16 IST)
చిన్నతనంలోనే ఊబకాయానికి గురయ్యేవారు చాలామంది ఉన్నారు. అందుకు పలురకాల కారణాలు ఉండొచ్చు. అయితే హార్మోన్లలో హెచ్చుతగ్గులు కూడా టీనేజ్‌లో ఊబకాయానికి కారణమంటున్నారు వైద్యులు. ఈ సమస్యను స్పెక్సిన్ అంటారు. ఈ స్పెక్సిన్ చిన్న వయసులోనే ఊబకాయానికి కారణమవుతోందని ఇటీవలే ఓ పరిశోధనలో తేలింది.
 
ఇందులో భాగంగా 51 మందిలో.. అలానే నార్మల్ వెయిట్ ఉన్న 12-18 వయసులోని వారిలో స్పెక్సిన్ ప్రమాణాలను పరిశీలించారు. అలానే పరిశోధనలో పాల్గొన్నవారి రక్తనమూనాలను పరీక్షించారు. వారిలోని స్పెక్సిన్ ప్రమాణాన్ని బట్టి టీనేజర్స్‌ను నాలుగా గ్రూప్స్‌గా విభజించారు. ఎక్కువ హోర్మోన్లు ఉన్నవారిలో కంటే స్పెక్సిన్ ప్రమాణాలు బాగా తక్కువ ఉన్నవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు 5 రెట్లు ఎక్కువ ఉందని స్పష్టం చేశారు. 
 
అందువలన ఆహారం భుజించిన తరువాత ఓ 5 నుండి 10 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన తప్పక ఊబకాయం నుండి విముక్తి లభిస్తుంది. ఒకవేళ చేయకపోతే.. తిన్న ఆహారం జీర్ణకాక రకరకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక జాగ్రత్త వహించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు