స్మార్ట్ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా? ఐతే మీ పని అయిపోయినట్టే. స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రతి నిమిషం కూడా గడవని పరిస్థితి. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది. చివరకి టాయ్‌లెట్‌లో కూడా స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా బాత్రూమ్‌ల్లో స్మార్ట్ ఫోన్లు వాడి వారికి పైల్స్ వ్యాధి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి చూస్తే… టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు ఫోన్‌ని తీసుకెళ్లడం వల్ల పైల్స్‌కి దారి తీస్తుంది.
యువతలో కూడా ఇది ఇప్పుడు వస్తోంది. మొబైల్ వల్ల పైల్స్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే… ఫోన్‌ని వాడడం వల్ల సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. దీని మూలంగా అది మారుతుంది. టాయ్‌లెట్‌లో స్మార్ట్ ఫోన్లను వాడటం ద్వారా కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. టాయిలెట్‌లో కూర్చుని పేపర్ చదివిన, మొబైల్‌ని ఉపయోగించిన సమస్య ఏమీ తెలీదు.