ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమౌతుంది..?

గురువారం, 29 జూన్ 2023 (19:13 IST)
Tea
నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీలు, టీలు తాగడం వల్ల శరీరానికి మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. కాఫీ, టీ తాగడం మరీ ప్రమాదకరం కాదు కానీ, మితంగా కాకుండా అతిగా తీసుకుంటే, నిద్రలేవగానే తాగితే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 
 
ఉదయం ఖాళీ కడుపుతో బెడ్ టీ తాగడం వల్ల శరీర ప్రాథమిక సమతుల్యత దెబ్బతింటుంది అని, ఇది ఎసిడిటీకి, అజీర్ణానికి దారితీస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
అంతేకాదు ఉదయం టీ లేదా కాఫీ తీసుకున్నవారిలో నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుందని ఇది నోట్లో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. అంతేకాదు పరగడుపున టీ తాగడం వల్ల పంటి ఎనామిల్ కోతకు గురవుటుందని, పళ్ళు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. 
 
కాఫీ, టీ తాగాలనుకుంటే సాయంత్రం సమయంలో స్నాక్స్‌తో పాటు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు వర్కౌట్‌లకు ముందు కాఫీ తాగడం కూడా మంచిదని చెప్తున్నారు. అలా అని పొద్దున్నే నిద్రలేవగానే పరగడుపున కాఫీలు, టీలు తాగడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వైద్యులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు