స్టేడ్‌ వివైడ్‌ అయినా అందరూ నావాళ్ళే భోళాశంకర్‌ టీజర్‌లో చిరంజీవి (video)

శనివారం, 24 జూన్ 2023 (18:27 IST)
Bholashankar Teaser poster
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళాశంకర్‌. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌ సంథ్యా 70.ఎం.ఎం. థియేటర్‌లో అభిమానులు, ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. కీర్తి సురేష్‌, సుశాంత్‌, తమన్నా తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతుంది. 
 
టీజర్‌లో ఏం చెప్పారంటే..
మొత్తం 33 మందిని చంపేశాడు.. అంటూ ఓ వాయిస్‌.. వెంటనే.. చిరంజీవి యాక్షన్‌ సీన్స్‌.  ఒక్కడేనా ! హౌ.. అంటూ విలన్‌ వాయిస్‌.. ఆ తర్వాత కౌనే తూ.. అని విలన్‌ అడగడంతో.. డోర్‌ తెరుచుకుని వచ్చిన చిరంజీవి.. షికారుకు వచ్చిన షేర్‌ ను బే.. అంటాడు. పక్క షాట్‌లో సుశాంత్‌, కీర్తి సురేష్‌ కనిపిస్తారు. అనంతరం మచ్చరవి బ్యాచ్‌తో కామెడీ సీన్‌.. వెంటనే నేపథ్య గీతం.. భగ భగ భోలా..అంటూ సాంగ్‌. అనంతరం హే.. భోలా ఇది నా ఏరియా.. అంటూ విలన్‌ పరుషమైన మాటలు.. స్టేడ్‌ వివైడ్‌ అయినా అందరూ నావాళ్ళే, నాకు హద్దులు లేవు. సరిహద్దులేవు.. దేక్‌లేంగే.. ఆగస్టు 11న అంటూ చిరంజీవి డైలాగ్‌తో ముగుస్తుంది.

 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు