శీతాకాలంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవడం, ఇమ్యూనిటీ పెంచే ఆహారపదార్థాలు, సమయానికి తినడం, వేడి ఆహారపదార్థాలను తీసుకోవడం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. శీతాకాలంలో ఏది పడితే అది తీసుకోకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు పోషకాహారం కాస్త ఎక్కువగా తీసుకోవాలి. వేడివేడి సూప్‌లు.. విటమిన్ ఇ ఉండే ఆహారపదార్థాలు.. ముఖ్యంగా నట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
దంతాల నొప్పికి లవంగాల నూనె భేషుగ్గా పనిచేస్తుంది. లవంగ నూనెలో దూదిని నానబెట్టకుండా.. ఒకసారి ముంచి తీసేయాలి. ఆ తర్వాత నొప్పి అనిపించిన చోట ఉంచాలి. లేదంటే.. చిగుళ్లు.. మంటపుడతాయి. అలాగే ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం.. లేదా పుక్కిలించడం లాంటివీ చేయకూడదు. ఎందుకంటే.. దాని తాలూకు ఇన్‌ఫెక్షన్ మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.