మద్యం తాగే అలవాటున్న మహిళల్లో హెచ్ఐవీ సోకే ప్రమాదం ఎక్కువట

సోమవారం, 15 ఆగస్టు 2016 (14:10 IST)
మద్యం అధికంగా తీసుకునే మహిళల్లో హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఉందని సర్వేలో తేలింది. మగ, ఆడ అనే తేడా లేకుండా హెచ్‌ఐవీ సోకేది తెలిసిందే. కానీ అధికంగా మద్యం తాగే ఆడవారిలో ఎక్కువగా ఈ హెచ్‌ఐవీ ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.

మద్యం మత్తులో రెచ్చిపోయి శృంగారంలో పాల్గొనడం వల్ల ఆడవారికి ఎక్కువగా హెచ్‌ఐవీ సోకే అవకాశాలున్నట్లు బిహేవియర్‌ మెడికల్‌ జర్నల్‌ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ దాదాపు 290 మందిపై ఈ ప్రయోగం నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఆడవారు మద్యం మత్తులో ఉన్న సమయంలో సెఫ్టీని పట్టించుకోరు అని, అందుకే వారికే ఎక్కువగా శృంగార సమస్యలు, సుఖ వ్యాధులు వస్తాయని సర్వేలో తేలింది. మగవారు మద్యం మత్తుతో శృంగారంలో పాల్గొనే సమయంలో కూడా సెఫ్టీని వాడతారు అని, అందువల్ల మద్యం సేవించే మగవారికి మద్యం సేవించే ఆడవారితో పోల్చితే కాస్త తక్కువగానే ఎయిడ్స్‌ ఉన్నట్లుగా తేలింది.

వెబ్దునియా పై చదవండి