'ఓ' గ్రూపు వారికి గుండెపోటు ముప్పు లేదా? సర్వే ఏం చెపుతోంది!

ఆదివారం, 28 మే 2017 (11:15 IST)
ప్రస్తుతం మారుతున్న జీవనపరిస్థితుల దృష్ట్యా గుండెపోటు ముప్పు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అయితే, ఎలాంటి రక్తపు గ్రూపు వారికి ఈ ముప్పు తక్కువగా ఉంటుందనే విషయంపై ఓ సంస్థ తాజాగా అధ్యయనం జరిపింది. ఇందులో వెల్లడైన విషయాలు గమనిస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. 
 
ఏ, బీ, ఏబీ గ్రూపుల వారితో పోల్చితే ఓ గ్రూపు రక్తం కలిగిన వారికి గుండెపోటు ముప్పు తక్కువగా ఉంటుందట. అంటే మిగతా గ్రూపుల వారితో పోలిస్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువేనట. ఈ విషయం నెదర్లాండ్స్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 
 
ఈ అధ్యయనంలో భాగంగా వారు 13.63 లక్షల నమూనాలను పరీక్షించించారు. బ్లడ్‌ గ్రూపుల వారీగా వలంటీర్ల ఆరోగ్యాన్ని, వారికి వచ్చిన వ్యాధుల వివరాలను నిశితంగా విశ్లేషించారు. వారిలో మొత్తం 23,154 మంది హృద్రోగ బాధితులను గుర్తించగా.. ఓ గ్రూపు వారు తక్కువ మంది ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి