స్త్రీ పరిశుభ్రత, రుతుక్రమం, గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన: ‘తేజస్విని’ని ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్

ఐవీఆర్

గురువారం, 7 మార్చి 2024 (19:15 IST)
భారతదేశంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హెల్త్‌కేర్ గ్రూప్‌లలో ఒకటైన కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్‌తో కలిసి కోనెక్సస్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సీఎస్ఆర్ కార్యక్రమం అయిన తేజస్వినిని ఈ రోజు ప్రారంభించినట్లు ప్రకటించింది. కేర్ హాస్పిటల్స్ మద్దతుతో, హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 9 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ కార్యక్రమం ద్వారా స్త్రీ పరిశుభ్రత, రుతుక్రమం, గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
మధ్యంతర బడ్జెట్ 2024లో ప్రధానంగా చెప్పబడినట్లుగా 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్‌ దిశగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, కేర్ హాస్పిటల్స్ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ డెలివరీకి భరోసానిస్తూ టైర్ II నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలపై తన దృష్టిని కొనసాగిస్తోంది. కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్ మాట్లాడుతూ, "సంపూర్ణమైన ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉన్న సంస్థగా, బాలికలకు ఆరోగ్యంపై పూర్తి అవగాహన కల్పించడంతో సాధికారత అందించాల్సిన ఆవశ్యకతను కేర్ హాస్పిటల్స్ గుర్తిస్తుంది. కోనెక్సస్, జగతి ఫౌండేషన్‌కు మద్దతు ఇస్తూ, మేము ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికల జీవితాలపై అర్ధవంతమైన ప్రభావం చూపాలనుకుంటున్నాము. అదే సమయంలో అవగాహన పెంపొందించడం, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడం చేయనున్నాము. ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన సమాజాలను సృష్టించే మా లక్ష్యంతో సమలేఖనం చేస్తుంది, సామాజిక బాధ్యత పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. 
 
యువతులకు సాధికారత లక్ష్యంతో, తేజస్విని కార్యక్రమంను హైదరాబాద్‌లోని 12 ప్రభుత్వ పాఠశాలల్లో లక్షిత వయస్సు గల 2000+ కంటే ఎక్కువ మంది బాలికల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికల జీవితాలను చేరుకోవడం, సానుకూలంగా ప్రభావితం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం. విస్తృతమైన ప్రభావం, అవగాహన పెంపొందించడం, స్త్రీ పరిశుభ్రత, రుతుక్రమం, గర్భాశయ క్యాన్సర్‌పై సమగ్ర అవగాహనను పెంపొందించడం తేజస్విని కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంది.
 
మనీష్ హండా, ప్రతినిధి- కోనెక్సస్, దుర్గా కళ్యాణి, ప్రతినిధి-జగతి ఫౌండేషన్, సంయుక్తంగా మాట్లాడుతూ, "తేజస్విని కార్యక్రమంపై కేర్ హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం కావడం పట్ల మేము సంతోషిస్తున్నాము. కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌లో మా నైపుణ్యం, ఆరోగ్య సంరక్షణ పట్ల కేర్ యొక్క నిబద్ధతను కలపడం ద్వారా, ఈ యువతుల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపగలమని మేము నమ్ముతున్నాము. స్త్రీ పరిశుభ్రత, రుతుక్రమ ఆరోగ్యం చుట్టూ ఉన్న సామాజిక అపోహలను చాలా అవసరం, ఈ కార్యక్రమంలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము"  అని అన్నారు. 
 
ఇన్ఫర్మేటివ్ సెషన్‌లతో పాటు, వైద్యుల ఇంటరాక్షన్‌లు, Q&A సెషన్‌లు, క్విజ్‌లతో సహా వివిధ అనుసంధానిత పద్ధతులను తేజస్విని ఉపయోగిస్తుంది. ఈ సెషన్‌లలో చురుకుగా తల్లులు సైతం పాల్గొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, తద్వారా తమ కుమార్తెల ఆరోగ్య విద్యకు మద్దతు ఇవ్వడంలో వారు పోషించే కీలక పాత్రను అర్థం చేసుకోగలరు. బహిష్టు దశలో ఉన్న బాలికల పరిశుభ్రత, ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి తేజస్విని చురుకుగా తమ  కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. పర్యావరణ సుస్థిరతను దృష్టిలో ఉంచుకుని, అవగాహన సెషన్‌ల సమయంలో ఈ బృందం ప్రతి అమ్మాయికి ఆర్గానిక్, ఎకో-ఫ్రెండ్లీ కాటన్ శానిటరీ నాప్‌కిన్‌లను (10 ప్యాక్) పంపిణీ చేస్తుంది. దీనితో, సంస్థ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ యొక్క విస్తృత లక్ష్యానికి దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు