బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

ఐవీఆర్

గురువారం, 20 జూన్ 2024 (19:28 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఏటా జూన్ 21న జరుపుకుంటారు. మెరుగైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం యోగాను రోజువారీ జీవితంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. యోగా యొక్క ప్రయోజనాలను పెంచడానికి, సమతుల్య, శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బాదంపప్పులో ప్రోటీన్, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ ఇ వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
 
బాదంపప్పులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, బరువు, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని మద్దతు అందిస్తాయి. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా నిధులతో ఇటీవల విడుదల చేసిన విటార్డ్ అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం, బాదంపప్పులు కండరాల నొప్పులను తగ్గించడానికి, వ్యాయామాల అనంతరం రికవరీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 
 
అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా యోగా సాధన చేస్తున్నాను. సానుకూల ఆరోగ్య ప్రయోజనాలను అనుభవించాను. సాధారణ యోగాభ్యాసంతో పాటు, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, బాదంపప్పులు, పెరుగు ఉండే శుభ్రమైన, సమతుల్యమైన ఆహారాన్ని నేను తప్పకుండా తీసుకుంటాను. యోగా సెషన్ల తర్వాత బాదం పప్పులు తీసుకోవడం అలవాటు చేసుకున్నాను" అని అన్నారు. 
 
న్యూ ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దర్ మాట్లాడుతూ, "వారానికి కనీసం ఐదు రోజులు ఏదో ఒక రకమైన వ్యాయామం చేయాలని నేను ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తున్నాను. యోగా నా ప్రధాన సిఫార్సుగా ఉంటుంది. ఫిట్నెస్ లక్ష్యాలు సాధించటానికి బాదంపప్పులు, ఆకు కూరలు, పండ్లు, ఇతర ఆహారాలను చేర్చడం ద్వారా బరువు, కొలెస్ట్రాల్ నిర్వహణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి" అని అన్నారు. 
 
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, "ఆనందకరమైన- ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది కాబట్టి యోగా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమని నేను గట్టిగా నమ్ముతున్నాను. వ్యాయామాన్ని శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కలిపి అనుసరించటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, ఎల్‌డి‌ఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది" అని అన్నారు.
 
ఫిట్‌నెస్- సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, "శరీరం, మనస్సు రెండింటినీ యోగా సంతోషంగా ఉంచుతుంది. నా బిజీ షెడ్యూల్ మధ్య ప్రశాంతంగా ఉండటానికి నేను వారానికి 2-3 సార్లు యోగా సాధన చేస్తాను. ఆరోగ్యం కోసం అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని నివారించడం, బాదం వంటి సహజమైన ఆహారాన్ని తినడం మంచిది" అని అన్నారు.
 
పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ, సంతోషకరమైన- ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని అభిప్రాయపడ్డారు. యోగతో పాటుగా, బాదంపప్పు వంటి పోషకమైన ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం, ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది బరువు నిర్వహణకు తోడ్పడుతుందన్నారు.

దక్షిణ భారత నటి ప్రణిత సుభాష్ మాట్లాడుతూ, “యోగా అనేది నా జీవితంలో అంతర్భాగం. నేను వారానికి కనీసం 2-3 రోజులు యోగా ఆసనాలను అభ్యసిస్తాను. అలాగే బాదంపప్పులు వాటి పుష్కలమైన పోషక పదార్ధాల కారణంగా నా ఆహారంలో భాగమయ్యాయి. నా కుటుంబ ఆహారంలో బాదంపప్పులు ఉండేలా చూసుకుంటాను" అని అన్నారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ, యోగాను అభ్యసించడం, బాదంపప్పులోని పోషకాల మంచితనాన్ని ఆస్వాదించడం ద్వారా ఆరోగ్యం- ఆనందం స్వీకరించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు