నేనెక్కడికెళ్తే నీకెందుకురా, గు- పగలకొడతా: మద్యం మత్తులో వున్న పోలీసుతో యువతి వాగ్వాదం (video)

ఐవీఆర్

బుధవారం, 3 సెప్టెంబరు 2025 (18:04 IST)
విజయవాడ సింగ్ నగర్ సెంటర్ నడిరోడ్డులో యువతిపై ఓ కానిస్టేబుల్ దాడి చేసాడు. దీనితో సదరు యువతి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. వాహనంపై వెళ్తున్న యువతిని ఆపి.. ఎక్కడికెళ్తున్నావ్ అంటూ తప్పతాగిన కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ అడిగినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. దీనితో పోలీసు కానిస్టేబుల్-యువతి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
 
వీరి మధ్యలోకి బీట్ కానిస్టేబుల్ కోటేశ్వర రావు వచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు చొక్కాలు పట్టుకుని గొడవపడ్డారు. వీడియోలో యువతి... నేను ఎక్కడికెళ్తే నీకెందుకురా, గు- పగలగొడతానంటూ బూతులు తిడుతూ కనిపించింది. కాగా విషయం పోలీసు అధికారుల వద్దకు వెళ్లడంతో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసారు.

విజయవాడలో మ‌ద్యం మ‌త్తులో నడిరోడ్డులో యువతిపై కానిస్టేబుల్ దాడి

యూనిఫాంలో ఉండి త‌ప్ప‌తాగి మహిళతో గొడవ పడిన విజయవాడ ఫోర్త్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస నాయక్

శ్రీనివాస నాయక్, మహిళ మధ్య గొడవలో జోక్యం చేసుకున్న విజయవాడ అజిత్ సింగ్ నగర్ బీటు కానిస్టేబుల్ కోటేశ్వరరావు… pic.twitter.com/ROhIqiUzwj

— Vizag - The City Of Destiny (@Justice_4Vizag) September 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు