అత్యంత క్లిష్టమైన వెన్నెముక కణితితో 19 ఏళ్ల బాలునికి మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవాడ డాక్టర్ల చికిత్స

సోమవారం, 20 జూన్ 2022 (22:23 IST)
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ అత్యంత విజయవంతంగా వెన్నెముక కణితితో బాధపడుతున్న 19 సంవత్సరాల బాలుడికి శస్త్రచికిత్స చేయడంతో పాటుగా అతని అవయాలను సైతం కాపాడారు. ఈ రోగి పలు హాస్పిటల్స్‌ను సందర్శించారు. అక్కడి డాక్టర్లు ఈ కణితి అత్యంత ముఖ్యమైన నాడీ నిర్మాణాల్లో ఉండటం వల్ల శస్త్ర చికిత్స చేయడం ప్రమాదంతో  కూడుకున్నదని, అతి రెండు కాళ్లు చచ్చుబడి పోయే అవకాశాలున్నాయని  వెల్లడించారు. చివరగా, ఆ రోగి మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడలో కన్సల్టెంట్‌ న్యూరో అండ్‌ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ ఉప్పు రవికాంత్‌ ను కలిశారు.

 
ఈ కేసు గురించి మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడలో కన్సల్టెంట్‌ న్యూరో అండ్‌ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ ఉప్పు రవికాంత్‌ మాట్లాడుతూ, ‘‘ తన రెండు  కాళ్లు పోతాయనే ఆందోళనతో రోగి మా దగ్గరకు వచ్చాడు. ఈ కేసులో దానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ, మేము అతనికి ఈ శస్త్ర చికిత్స ఫలితాల పట్ల భరోసా అందించాము. ఎందుకంటే, ఈ తరహా కేసులకు చికిత్స చేసిన అనుభవం మాకు ఉంది.


ఈ 19 సంవత్సరాల యువకుని అతి తీవ్రమైన వెన్నునొప్పి ఉంది. అతను నడవడానికి కష్టపడుతున్నాడు. వారం రోజులుగా మంచానికే పరిమితమయ్యాడు. అవసరమైన పరీక్షలను చేయడం జరిగింది. సర్వైకో-డోర్సాల్‌ స్పైన్‌‌కు ఎంఆర్‌ఐ చూపే దాని ప్రకారం అతని వెన్నుముకలో పెద్ద కణితి ఉన్నట్లుగా గుర్తించాము. అది దాదాపుగా అతని వెన్నుముకలో సగం నాశనం చేసింది (మొత్తం 8 బాడీ లెవల్స్‌). ఈ తరహా కణితిలు అతి అరుదుగా వస్తుంటాయి. వేగంగా వెన్నుముక మధ్యకు విస్తరిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే, మొత్తం వెన్నుముకనే నాశనం చేస్తాయి’’ అని అన్నారు.

 
‘‘ఈ కేసులో, కణితి  అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో ఉంది (అత్యంత క్లిష్టమైన నాడీ నిర్మాణాల మధ్యన ఉంది). మేము సాధారణ నరాలను అతి సున్నితంగా వేరు చేశాం. శస్త్రచికిత్స సమయంలో జరిగే అతి చిన్న పొరపాటు కూడా శాశ్వతంగా నాడీ సంబంధిత లోపాలకు దారితీయవచ్చు. ఈ తరహా కణితిలలో, రోగి  నీరసించి పోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతేకాదు, అతను ప్రాణాలు కోల్పోయేందుకు సైతం 50% అవకాశాలున్నాయి. అత్యంత జాగ్రత్తగా మేము ఈ మొత్తం కణితిని నరాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా తొలిగించాము. ఈ శస్త్ర చికిత్సను దాదాపు 9 గంటల పాటు చేశాము. ఈ రోగి మొత్తం మ్మీద 3.5 లీటర్ల రక్తం కోల్పోయాడు. మా బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఈ రక్తం అతనికి వెంటనే అందించగలిగాము. మేము అతని కాళ్లు, జీవితం కూడా కాపాడాము. ఎలాంటి మద్దతు అవసరం లేకుండా  అతనిప్పుడు నడవగలుగుతున్నాడు.’’ అని డాక్టర్‌ ఉప్పు రవికాంత్‌ అన్నారు.

 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘సమాజానికి అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించాలన్నది  తమ ప్రయత్నం. అత్యాధునిక క్లీనికల్‌ నైపుణ్యంతో కూడిన అనుభవంతో ప్రతి రోగిని పరీక్షించి, తగిన చికిత్సనందించడం కీలకం. మా సమగ్రమైన న్యూరో, స్పైన్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఈ ప్రాంతంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తుంది. రోగులు ముందుకు వచ్చి మెరుగైన చికిత్సను పొందాలి. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డాక్టర్లు ఎప్పుడూ కూడా పూర్తి అంకిత భావంతో, అసాధారణ నైపుణ్యంతో వైద్య సేవలనందిస్తుంటారు. మా బృందానికి డాక్టర్‌ ఉప్పు రవికాంత్‌ నేతృత్వం వహించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ రోగికి ఆయన అసాధారణ చికిత్సనందించడంతో పాటుగా విశేషమైన ఫలితాలను సాధించారు’’ అని అన్నారు.

 
ఈ హాస్పిటల్‌లో అత్యాధునిక న్యూరో, స్పైన్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఉంది. ఇది నాడీ మరియు వెన్నుముక శస్త్ర చికిత్సలకు విప్లవాత్మక సాంకేతికతను వినియోగించుకుంటుంది. ఇక్కడ స్పెషలైజ్డ్‌ డాక్టర్లు వెన్నుపాము కణితిలతో బాధపడుతున్న పిల్లలు మరియు పెద్దలకు సమస్య గుర్తించడంతో పాటుగా తగిన చికిత్సనూ అందిస్తున్నారు. వీరు ఇంట్రా ఆపరేటివ్‌ బయాప్సీ, కణితిల తొలగింపు, శస్త్రచికిత్సకు ముందు రక్తనాళాలలో కణితిలను తొలగించడం, ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో ఫిజియాలజీ మానిటరింగ్‌ వంటి ప్రక్రియలనూ చేస్తున్నారు. రోగులను ఒకేచోట పరిశీలించడం మరియు చికిత్సనందించడం చేయడం జరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు