గుండె సంబంధిత వ్యాధులకు ట్రాఫిక్ జామ్‌కు లింకుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. హైవేల పక్కన నివాసముండే వారికి గుండెపోటు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. రోడ్డు, రైలు రాకపోకల ద్వారా కలిగే శబ్ధ కాలుష్యం ద్వారా గుండెకు ప్రమాదమేనని జర్మన్ పరిశోధకులు అంటున్నారు. ఈ విషయం అధ్యయనంలో తేలిందని జర్మనీకి చెందిన డ్రెస్డెన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అండ్రీస్ సెడ్లెర్ తెలిపారు.
రహదారికి సమీపంలో నివాసముండటం ద్వారా రోడ్డుపై రవాణా రాకపోకలతో ఏర్పడే శబ్ధం ద్వారా గుండె సంబంధిత సమస్యలు సులభంగా వచ్చేస్తాయని సెడ్లెర్ వెల్లడించారు. 40 వయసు గల మిలియన్ల మంది జర్మన్లపై చేసిన అధ్యయనం ఈ విషయం తేలిందని.. శబ్ధ కాలుష్యంతో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలినట్లు సెడ్లర్ చెప్పుకొచ్చారు. 65 డెసిబెల్ కంటే అధికంగా శబ్ధ కాలుష్యమున్న ప్రాంతాల ప్రజలు గుండెపోటు ప్రమాదం బారిన పడుతున్నారని వెల్లడైంది.