యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

ఐవీఆర్

మంగళవారం, 21 జనవరి 2025 (23:05 IST)
దాదాపు 46,000 మందికి పైగా ప్రసూతి మరియు గైనకాలజీ నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న, భారతదేశంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (FOGSI), యునిసెఫ్ సహకారంతో భారతదేశంలోని తల్లులు, శిశువుల సమగ్ర సంక్షేమంపై ఒక సంచలనాత్మక కార్యక్రమం అయిన ‘ఆరోగ్య యోగ యాత్ర’ను ప్రారంభించింది. ఫాగ్సి అధ్యక్షురాలు డాక్టర్ సునీతా తందూల్వాడ్కర్, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఈ పరివర్తనాత్మక ప్రచారాన్ని ప్రారంభించారు. భారతదేశంలోని 13 ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశాలలో ఏడాది పొడవునా జరిగే ఈ జాతీయ కార్యక్రమం, ఆధ్యాత్మికతను వైద్యంలో అనుసంధానించడం, మహిళలు మరియు వైద్యులలో ఆరోగ్యం పట్ల చురుకైన విధానాన్ని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
హాజరైన సభికులను ఉద్దేశించి, ఫాగ్సి  అధ్యక్షురాలు డాక్టర్ సునీతా తందూల్వాడ్కర్ మాట్లాడుతూ, “ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ఈ తరహా ప్రచారం చాలా ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే మన దేశంలో ప్రపంచంలోనే పురాతనమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఉన్నాయి. వైద్యురాలిగా నా 34 సంవత్సరాల అనుభవంలో, ప్రతిరోజూ ఉత్తమంగా నా సేవలను అందించడానికి నాకు ఆధ్యాత్మికత దోహదపడింది. ఇది విశ్వశక్తితో మనల్ని కలుపుతుంది, సమగ్రంగా నయం చేయడానికి మనల్ని నడిపిస్తుంది. ఈ యాత్ర అనేది అన్ని ఫాగ్సి సభ్యులతో, పెద్ద సమాజంతో ఈ సాక్షాత్కారాన్ని పంచుకోవడానికి ఒక మార్గం. ఈ జాతీయ ప్రచారం మహిళల్లో చురుకైన ఆరోగ్య నిర్వహణ సంస్కృతిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన గర్భాలను పెంపొందించడంపై కూడా దృష్టి సారించింది. ఈ రెండూ మహిళల అనారోగ్యం, మరణాలను గణనీయంగా తగ్గించడం ద్వారా మహిళల ఆరోగ్యానికి కీలకం కావచ్చు” అని అన్నారు.
 
యునిసెఫ్ ఇండియా ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సయ్యద్ హుబ్బే అలీ మాట్లాడుతూ, “గర్భిణీ స్త్రీల మానసిక ఆరోగ్యం అత్యంత క్లిష్టమైనది కానీ తరచుగా నిర్లక్ష్యం చేయబడిన సమస్యగా నిలుస్తుంది. భారతదేశంలో గర్భధారణ సంబంధిత ఒత్తిడి 40% మంది మహిళలను, నిరాశ 20% మందిని, ఆందోళన 33% మందిని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రచారం ద్వారా, యునిసెఫ్, ఫాగ్సి దేశవ్యాప్తంగా వైద్య సమాజంలో తల్లి మానసిక ఆరోగ్యాన్ని ఏకీకృతం చేయడానికి కట్టుబడి ఉన్నాయి" అని అన్నారు.
 
తిరుపతిలోని SVMC అసోసియేషన్ భవనంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైద్య రంగం లోని ప్రముఖులు, నిపుణులు హాజరయ్యారు. వీరితో పాటుగా తిరుపతి గౌరవనీయ ఎమ్మెల్యే డాక్టర్ అరణి శ్రీనివాసులు, తిరుపతి గౌరవనీయ ఎంఎల్సి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, గౌరవనీయ తిరుపతి మేయర్ డాక్టర్ ఆర్ శిరీష వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు, వారు ఈ కార్యక్రమంను ప్రశంసించారు, మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే దాని సామర్థ్యాన్ని వెల్లడించారు. 
 
‘ఆరోగ్య యోగ యాత్ర’లో వైద్యంలో ఆధ్యాత్మికతపై నిరంతర వైద్య విద్య(CME), సమగ్ర వైద్యంను స్వీకరించడం ద్వారా వ్యాధుల చికిత్సకు మించి వైద్యులు వెళ్లేలా ప్రోత్సహించడానికి ప్రజా వేదికలు ఉంటాయి. ఈ ప్రచారం తమ తదుపరి కార్యక్రమం ను ఫిబ్రవరి 20-21, 2025న రిషికేశ్‌లో నిర్వహించనుంది. యునిసెఫ్ సహకారంతో ఫాగ్సి అధ్యక్షురాలు డాక్టర్ సునీతా తండూల్వాడ్కర్ నేతృత్వంలో జరిగే ఈ ప్రచారానికి, భారతదేశం అంతటా ఇరవై మంది ఫాగ్సియన్స్ ల క్రియాశీల మద్దతు లభించింది. ఈ కార్యక్రమంను అమలు చేయడానికి ఈ ప్రాజెక్టుకు జాతీయ కన్వీనర్లుగా పనిచేస్తున్న ఫాగ్సి సీనియర్ ఫాగ్సియన్ డాక్టర్ జయం కన్నన్, ఫాగ్సి జాయింట్ సెక్రటరీ డాక్టర్ అశ్విని కాలే మరియు ఫాగ్సి  వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పళనియప్పన్ మద్దతు ఇస్తున్నారు.
 
ఈ ప్రచారంలో రెండు కీలక అంశాలు భాగంగా ఉంటాయి:
“మీ సంఖ్యలను తెలుసుకోండి”: భారతదేశం అంతటా మహిళల నుండి బరువు, రక్తపోటు, రక్తంలో చక్కెర, హిమోగ్లోబిన్ స్థాయిలు వంటి ముఖ్యమైన ఆరోగ్య డేటాను సేకరిస్తుంది, ఆరోగ్య ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం, నివారణ సంరక్షణను ప్రోత్సహిస్తుంది.
 
“సంపూర్ణ: స్వస్థ జన్మ అభియాన్”: గర్భధారణకు ముందు సంరక్షణపై దృష్టి సారిస్తుంది, సరైన ఆరోగ్య ప్రమాణాలను నొక్కి చెబుతుంది మరియు మెరుగైన తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్య ఫలితాల కోసం గర్భధారణలను ప్రణాళిక చేయడం గురించి మహిళలకు అవగాహన కల్పిస్తుంది.
 
ఈ ప్రత్యేకమైన కార్యక్రమం భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధునిక వైద్యంతో మిళితం చేసి, మహిళలను శక్తివంతం చేయటం ద్వారా , దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మార్చివేయగలదనే హామీ ఇస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు