రానురాను సెక్స్ అనేది ఒక్క మగవాడికే అవసరం అన్నట్లు తయారవుతోంది. స్త్రీలలో సెక్స్ సామర్ధ్యం, దానిపై ఆసక్తి క్రమేపీ తగ్గిపోతోంది అంటున్నారు కిన్సీ అనే పరిశోధకురాలు. ఆరోగ్యం సంగతికి వస్తే, పురుషుల కంటే స్త్రీలకే అనారోగ్య సమస్యలు ఎక్కువ. శృంగార జీవితం కూడా ఎక్కువ శాతం మగవాళ్ళ అవసరంలాగే మారిపోతోంది. ఇది ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్య.
డెన్మార్క్‌లో 40 సంవత్సరాల మహిళల్ని ఇంటర్వ్యూ చేయగా, వారిలో 35 శాతం మంది తమకు సెక్స్ సమస్యలున్నాయని చెప్పారు. ఇంగ్లాండులో 45 శాతం మంది తమకు సెక్స్ సమస్యలున్నాయని, కోరికలు తగ్గిపోతున్నాయని చెప్పారు. పదకొండు శాతం మంది అసలు భావప్రాప్తి కలగడంలేదన్నారు. అదే మనదేశంలో అయితే, 35 శాతం మహిళల్లో సెక్స్ కోరికలు తగ్గిపోయాయి.
ఆనందం లేకపోవడం 12 శాతం మందిలో, భావప్రాప్తి కలగపోవడం 7 శాతం మందిలో కనుగొన్నారు. తమకు శృంగారం అంటే అసహ్యమని 3 శాతం మంది చెప్పారు. అయితే ఇదంతా వారి ఆరోగ్య సమస్యల వలనే అని వైద్యులు చెపుతున్నారు. దీనితోపాటు శృంగారంపై ఆసక్తి కలిగేలా దంపతుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని పేర్కొంటున్నారు.