ఒత్తిడి నుంచి బయట పడేందుకు మార్గం ఉందా..? ఏమిటా ప్రొటీన్..?

సోమవారం, 5 అక్టోబరు 2015 (18:48 IST)
ఆధునిక కాలంలో ఒత్తిడి లేని ఉద్యోగం.. ఒత్తిడిలేని వ్యాపారం ఉందంటారా... అదే సాధ్యమేనా.. అంటే నూటికి 90 వీలుపడదనే చెబుతారు. అంటే అందరూ ఒత్తిడి సమస్యను భరిస్తూనే ఉన్నారు. అదే ఒత్తిడిపై పని చేసే ఏదైనా మార్గం లభిస్తే అంత కంటే ఏముంటుంది చెప్పండి శాస్త్రవేత్త ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. శరీరంపై ఒత్తిడికి చికిత్స చేసేందుకు శాస్త్రవేత్తలు ఒక ప్రోటీన్‌ను గుర్తించారు.
 
పరిశోధనలో ఫలితానుల సాధించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో TRPV1 అనే ప్రోటీన్ ఒత్తిడి వలన కలిగే ఆందోళనను నియంత్రిస్తుందని చెబుతున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో TRPV1 అనే ప్రోటీన్ శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే  noradrenaline పదార్థాన్ని విడుదల చేస్తుందని చెప్పారు. ఇదే ఒత్తిడిపై కొత్త పరిశోధనలకు దారితీస్తోందని అంటున్నారు. 
 
లండన్‌లోని కింగ్స్ కాలేజ్ వద్ద ఫార్మాస్యూటికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్‌లో పని చేసే జూలీ కీబ్లే అనే పరిశోధకుడు దీనిపై పరిశోధన చేశారు. ఆయన తమ అధ్యయనాన్ని గురించి చెప్పారు. మాదకద్రవ్యాలు అధిక మోతాదులో తీసుకున్న, లేదా అనస్థీషియా ఇచ్చినప్పుడు వాటి శరీరంలోని మార్పులను గమనించారు. TRPV1 ప్రోటీన్ కలిగి సాధారణ ఎలుకలలో మార్పులను గమనించారు. దీనిని మరింత అభివృద్ధి పరిస్తే TRPV1 ప్రోటీన్ వలన మంచి ఫలితాలు సాధించవచ్చునని ఒత్తిడి నుంచి సులభంగా బయటపడవచ్చునని చెబుతున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి