కాటేస్తున్న కేన్సర్ : యేడాదిలో 8.1 లక్షల మంది మృతి

శనివారం, 22 డిశెంబరు 2018 (09:45 IST)
దేశ ప్రజలను కేన్సర్ మహమ్మారి కాటేస్తోంది. ఫలితంగా ఈ యేడాది ఇప్పటికే 8.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ నివేదికను సభలో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం 2018లో 15.86 లక్షల మంది కేన్సర్ మహమ్మారికి ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది.
 
ఈ సంఖ్య 2017లో 7.66 లక్షలుగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే, 2017లో 15.17 లక్షలు, 2016లో 14.51 లక్షల కేన్సర్ కేసులు కేసులు నమోదైనట్టు వివరించారు. ప్రధానంగా గొంతు, రొమ్ము, సెర్వికల్‌ క్యాన్సర్‌ల బారినపడేవారే ఎక్కువగా ఉన్నారని, ఇందుకోసం బీపీ, డయాబెటిస్‌, ఇతర కేన్సర్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు ఆమె వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు