నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒకటైన పార్వతి హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ల కోసం ట్రామా ట్రైనింగ్ కోర్సును నిర్వహించారు. నగరంలోని ఉన్న ప్రముఖ హోటల్‌లో శుక్రవారం జరిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా సుమారు 250 మంది ఆర్థోపెడిక్స్ సర్జన్లు పాల్గొన్నారు. ఈ సదస్సును ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్, తమిళనాడు ఆర్థోపెడిక్ అసోసియేషన్, మద్రాస్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ తరహా సదస్సు చెన్నైలో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ సదస్సులో సింగపూర్, వియత్నాంవంటి దేశాలతో పాటు దేశం నలుమూలల నుంచి సుమారు 250 మంది వైద్యులు హాజరయ్యారు. ఈ సదస్సులో సింగపూర్‌కు చెందిన డాక్టర్ ఛీ యు హాన్, జర్మనీ - మునిచ్‌కు చెందిన డాక్టర్ ఫ్లోరియాన్ హాస్టర్స్, సింగపూర్‌కు చెందిన హితేంద్ర జోషి, పాట్నాకు చెందింన డాక్టర్ జాన్ ముఖోపాధ్యాయ, చెన్నైకు చెందిన డాక్టర్ గోవర్ధన్, వేలూరు సీఎంసీకి చెందిన డాక్టర్ భూపాలన్ రామస్వామి, కోయంబత్తూరు కేఎంసీకి చెందిన డాక్టర్ తిరుమలైస్వామి వంటి వైద్య నిపుణులు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న వైద్య ప్రతినిధులు.. ఎనిమిది లైవ్ సర్జీలతో పాటు.. వివిధ అంశాలపై వైద్య నిపుణులు చేసిన ప్రసంగాలను ఆలకించి, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
అలాగే, అత్యంత క్లిష్టతరమైన ట్రామా సర్జరీలను యువ డాక్టర్లు నిర్వహించేందుకు ఈ తరహా కోర్సులు ఎంతగానో దోహదపడుతాయని ఇందులో పాల్గొన్న వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పార్వతి హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ ఎస్.ముత్తుకుమార్ మాట్లాడుతూ సర్జికల్ ఎడ్యుకేషన్ రంగంలో వచ్చే కొత్త ఆవిష్కరణలు, వైద్య నిపుణుల అనుభవాలను యువ వైద్యులకు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఈ కోర్సు మోకాలు, భుజం, మోచేయి, పాదం, చీలమండ వంటి గాయాలపై అత్యాధునిక సర్జరీలకు ఎలా చేయాలో విపులంగా విశదీకరించిందని చెప్పారు.
ఈ సదస్సులో డాక్టర్ డీన్ మహ్మద్ ఇస్మాయిల్, డాక్టర్ ఆర్ శివకుమార్, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ఆంటోనీ విమల్‌రాజ్, డాక్టర్ జి మోహన్, డాక్టర్ గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు.