కుష్టువ్యాధి బాధిత వ్యక్తుల గౌరవాన్ని ప్రోత్సహించడానికి పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ సెకండ్ గ్లోబల్‌ ఫోరమ్‌

మంగళవారం, 8 నవంబరు 2022 (21:24 IST)
హాన్సెస్స్‌ వ్యాధిగా సుపరిచితమైన కుష్టువ్యాధిపై రెండవ పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లో నవంబర్‌ 6 నుంచి 8వ తేదీ వరకూ జరిగింది. దాదాపు 21 దేశాల నుంచి 20 పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌కు చెందిన 100 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును ‘హాన్సెన్స్‌ వ్యాధి బారిన పడిన బాధిత వ్యక్తుల గౌరవాన్ని ప్రోత్సహించడానికి పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ యొక్క బాధ్యతలు మరియు సామర్థ్యం పెంపొందించడం’ నేపధ్యంతో నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో మిస్‌ వరల్డ్‌ బ్రెజిల్‌-లెటిసియా సీజర్‌ డా ఫ్రోటా, మిస్‌ సుప్రానేషనల్‌ ఇండియా- ప్రజ్ఞా అయ్యగారి ఈ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు.  వీరితో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ గుడ్‌ విల్‌ అంబాసిడర్‌ ఫర్‌ లెప్రసీ ఎలిమినేషన్‌ యోహీ సాసాకావా సైతం పాల్గొన్నారు. వీరితో పాటుగా నిప్పాన్‌ ఫౌండేషన్‌ మరియు సాసాకావా హెల్త్‌ ఫౌండేషన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన సాసాకావా లెప్రసీ (హాన్సెన్స్‌ డిసీజ్‌) కార్యక్రమం సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంది.
 
మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ యొక్క బాధ్యతలు భాగస్వామ్యాలను పెంపొందించేలా నిర్వహించారు. సాసాకావా లెప్రసీ (హాన్సెన్స్‌ డిసీజ్‌) నిర్వహించిన ఈ సదస్సును కొవిడ్‌ 19 మహమ్మారి కాలంలో ప్రారంభించిన తమ ‘డోంట్‌ ఫర్‌గెట్‌ లెప్రసీ’(కుష్టువ్యాధిని మరిచిపోవద్దు) కార్యక్రమంలో భాగంగా నిర్వహించింది.
 
ఈ ఫోరమ్‌లో యోహీ సాసాకావా మాట్లాడుతూ, ‘‘ఇటీవలి కాలం వరకూ కూడా  కుష్టువ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తమ హక్కులను పొందడం కష్టంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా పీపుల్స్‌ ఆర్గనైజేషన్స్‌ రెండవ గ్లోబల్‌ ఫోరమ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. వీరంతా కూడా తమ దేశాలకు వెళ్లి మరింతగా ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించగలరని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
 
ప్రజ్ఞ్యా అయ్యగారి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరయ్యేంత వరకూ తనకు లెప్రసీ గురించి పెద్దగా తెలియదన్నారు. ఈ సమస్యను చిన్నారులు, యువత దృష్టికి తీసుకువెళ్తే, ఈ వ్యాధిపట్ల వారి అభిప్రాయం ఖచ్చితంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానన్నారు.
మిస్‌ వరల్డ్‌ బ్రెజిల్‌ 2022 మిస్‌ లెటిసియా సీజర్‌ డా ఫ్రోటా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా తానెంతో స్ఫూర్తి పొందానన్నారు. బ్రెజిల్‌ చేరుకున్న తరువాత తన సమయాన్ని కుష్టువ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల కోసం అంకితం చేయనున్నాము. మిస్‌ సుప్రా నేషనల్‌ ఇండియాతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి పట్ల అవగాహన మెరుగుపరచనున్నానన్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ ఎఫెక్టడ్‌ బై లెప్రసీ  అధ్యక్షులు మాయా రనవారీ భారతదేశంలోని కుష్టువ్యాధి గ్రస్తుల తరపున ఈ ఫోరమ్‌లో చర్చకు వచ్చిన అంశాలను ఐఎల్‌సీ సదస్సులో సమర్పించనున్నామని తెలిపారు.  ఈ సమావేశంలో ఐడియా ఘనాకు చెందిన కోఫీ న్యార్కో, బ్రెజిల్‌లోని మోర్హం నుంచి ఫౌస్టినో కూడా పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు