నిద్రను మినహాయిస్తే.. మనం కూర్చుని ఉండే సమయం రోజుకు 9 గంటలకు కంటే ఎక్కువ ఉండకూడదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం 18 - 64 మధ్య వయస్కులు వారానికి కనీసం 75 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, కానీ చాలామంది అది చేయడం లేదని తేల్చారు.
దాని కోసం 36,383 మందిపై అధ్యయనం చేశారు. అందరి కంటే తక్కువ శారీరక శ్రమ లేక వ్యాయామం చేసిన 2,149 మంది తమ సగటు జీవితకాలం కంటే ముందుగానే మరణించినట్టు తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రోజూ వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.