మొన్నటివరకు ఎయిడ్స్, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దేశాన్ని పట్టిపీడిస్తే... ఇపుడు థైరాయిడ్ భారతీయులను కబళిస్తోంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. వీరిలో కూడా ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఈ వివరాలను ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ అనే సంస్థ వెల్లడించింది.
బరువు పెరగడంతో పాటు, హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఈ సమస్య ఎదురవుతున్నట్టు సర్వేలో తేలింది. థైరాయిడ్ లోపంతో బాధపడేవారు శారీరక బలహీనతకు లోనవుతారని... బరువు పెరగడం, డెప్రెషన్, అలసట, కొలెస్టరాల్ పెరగడం వంటి సమస్యలతో బాధపడతారని డాక్టర్లు చెప్పారు.