ట్రాఫిక్ జామ్‌ల మాట అటు ఉంచితే.. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే వారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయట. పలువురు సైంటిస్ట్‌లు చేపట్టిన తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ప్రతినిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకుని గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలని ఆందోళనలో ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గమ్యస్థానాలకు సరైన సమయంలో చేరుకుంటామా లేదా అనే ఆందోళనతో పాటు ట్రాఫిక్‌లో నిలబడి ఉన్నప్పుడు వాహనాలు చేసే శబ్దాలకు తీవ్ర ఒత్తిడికి గురై గుండె సమస్యలు వస్తాయని సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రద్దీ లేని సమయాల్లో మాత్రమే రహదారులపై వెళితే ఆందోళన తగ్గించుకోవడంతో పాటు గుండె సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటూ సైంటిస్టులు సూచిస్తున్నారు.