సోషల్ మీడియా యువతను పెడదారి పట్టిస్తుందని సర్వేలు తేల్చిన నేపథ్యంలో అదే సామాజిక మాధ్యమాలతో వృద్ధులకు మేలే జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా యువత సెల్ఫీలు, చాటింగ్‌లతో సమయాన్ని వృధా చేసుకోవడం, అపరిచితులతో స్నేహం, ప్రేమతో మోసపోవడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
అయితే రిటైర్మెంట్‌కు అనంతరం హాయిగా డైటింగ్, వ్యాయామం చేసుకుంటూ పోయే వృద్ధులకు మాత్రం సామాజిక సైట్ల ద్వారా మేలే జరుగుతుందని అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విలియమ్ చొపిక్ వెల్లడించారు.
వృద్ధాప్యం కారణంగా ఒంటరితనం వేధిస్తుంది. అలాంటి సమయంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలైన సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని తమ ఈ-మెయిల్స్‌ను చెక్ చేసుకోవడం, ఆత్మీయులతో సంభాషించడం ద్వారా మంచి సంబంధాలు కలిగి వుంటారని.. తద్వారా హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.