ఆరోగ్యానికి పీచు పదార్థం మిన్న

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆహారపదార్థాలు పౌష్టిక తత్వాలను అందిస్తుంటాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలుండే ఆహారం తీసుకుంటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు.

శరీరానికి ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్సు ఎంత అవసరమో పీచు పదార్థాలుకూడా శరీరానికి అంతే అవసరమంటున్నారు వైద్యులు.

పండ్లు, కూరగాయలు, పప్పులు, గోధుమలు, మొక్కజొన్న తదితరాలలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకునే పీచుపదార్థాలు ఉదరభాగాన్ని పూర్తిగా శుభ్రపరిచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుంతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

నిత్యం ఫైబర్ తీసుకోవండ వలన మధుమేహం, క్యాన్సర్, గుండెకు సంబంధించిన జబ్బులు దరిచేరవు. అలాగే ఊబకాయం బారిన పడకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి