గాసిప్‌తో సందడి చేసే పల్లెటూరి నేపథ్యంలో సాగే కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ కలలు, విలేజ్ డ్రామా ఒకదానితో ఒకటి కలిసిపోయే వరల్డ్ పరిచయం చేస్తుంది. మనోజ్ చంద్ర రికార్డ్ డ్యాన్స్ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. అతను డ్యాన్స్ పార్ట్నర్ కోసం వెదుకుతున్నప్పుడు ఊహించని సమస్యలలో చిక్కుకుంటాడు.
కొత్తపల్లిలో ఒకప్పుడు రిఫ్రెష్‌గా ఉండే రస్టిక్ టోన్ లో ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ పెట్రోస్ ఆంటోనియాడిస్, గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చూపించాడు. మణిశర్మ సంగీతం సమకూర్చగా, వరుణ్ ఉన్ని అందించిన నేపథ్య సంగీతం టీజర్ ఫన్ ని ఎలివేట్ చేసింది.
తారాగణం: మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్